![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -235 లో.....గంగ పేరెంట్స్ ఇంటికి రావడంతో శకుంతల వాళ్లని అవమానించి పంపిస్తుంది. గంగ వాళ్ళ పేరేంట్స్ బయటకు వెళ్తుంటే ఎదురుగా కార్ వస్తుంది. అందులో నుండి దిగి రుద్ర, రంగా వస్తారు. ఏం అయిందని అడుగగా జరిగింది చెప్తారు. దాంతో గంగ వాళ్ళ పేరేంంట్స్ కి రుద్ర సారీ చెప్తాడు. ఇక వాళ్ళకి గంగ ఎలా దొరికిందో చెప్పాలని గంగ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అనుకుంటారు. ఇక గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ అసలు గతంలో ఏం జరిగిందో రుద్రతో చెప్తుంది.
బాబు గంగని మేమేం తీసుకొని రాలేదు.. తన తండ్రి వద్దనుకొని వదిలేసి వెళ్ళాడని రుద్రకి లక్ష్మీ జరిగింది మొత్తం చెప్తుంది. గతంలో గంగ వాళ్ళ నాన్న గంగని తన ఆశయానికి ఉపయోగపడే బిడ్డ కాదని వదిలించుకుంటాడు. అటుగా వెళ్తున్న లక్ష్మీ తనని తీసుకొని వచ్చింది సాదుకుంటుంది. ఆశయం కోసం బిడ్డని వదులుకునే తండ్రి కూడా ఉన్నాడా అని జరిగింది విని రుద్ర షాక్ అవుతాడు. మరొకవైపు గంగ అసలైన తండ్రి విశ్వనాథ్ బాక్సింగ్ కోచ్.. అతను ఒక అతనికీ ట్రైనింగ్ ఇస్తాడు. అతడి పేరు ధీరజ్. ధీరజ్ ని పోటీకీ సిద్ధం చేస్తాడు విశ్వనాథ్. ఇన్నిరోజులకి నా ఆశయాన్ని నిలబెట్టే రోజు వచ్చింది.. నువ్వు త్వరలో వైజాగ్ లో జరగబోయే పోటీలో పార్టీసిపేట్ చేస్తున్నావని విశ్వనాథ్ తన శిష్యుడు ధీరజ్ కి చెప్తాడు. మరొకవైపు రుద్ర వచ్చేసరికి గంగ కోపంగా ఉంటుంది. గంగ త్వరలో వైజాగ్ లో బాక్సింగ్ పోటీ ఉంది.. అది విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.. ఆయనా ఇక్కడికి వచ్చి మన అకాడమీలో సెషన్స్ తీసుకుంటాడని గొప్పగా చెప్తాడు. అయినా గంగ డల్ గా ఉంటుంది. ఎవరో వస్తే ఏంటి.. ఆయనేమైనా వచ్చేది మా నాన్ననా..మా కోచ్ ఆ.. అని గంగ అంటుంది. అది కాదు ఆయన క్లాస్ లు వింటే బాగుంటుందని గంగతో రుద్ర చెప్తాడు.
ఆ తర్వాత ప్రమీల డల్ గా సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తనని నవ్వించడానికి మక్కామ్, కార్తీక్ ప్లాన్ చేస్తారు. ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేసి ప్రమీలని నవ్విస్తారు. ఆ తర్వాత పెద్దసారు హాల్లోకి వచ్చి మాట్లాడతాడు. అప్పుడే రాఘవ, సూర్య వచ్చి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందని అందరికి చెప్తాడు. తరువాయి భాగంలో పెద్దసారు చెల్లి గురించి మాట్లాడుతుంటే తన గురించి టాపిక్ తియ్యకండి అని శకుంతల కోప్పడుతుంది. ఆ విషయం గంగ విని రుద్రకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |